Cheapest Clothing Market: ఈ మార్కెట్‌లో తక్కువ ధరకే మంచి డ్రెస్సులు కొనుగోలు చేయవచ్చు..!
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:00 PM
విద్యార్థులకు, ఫ్యాషన్ ప్రియులకు, షాపింగ్ ఔత్సాహికులకు.. అదిరిపోయే న్యూస్ ఇది. అవును, కొత్త కొత్త దుస్తులు, ట్రెండ్‌కు తగ్గ దుస్తులు ధరించాలనుకునే వారికోసం నిజంగా అదిరిపోయే న్యూస్ ఇది. జీన్స్, టాప్స్, కుర్తాలు, సంప్రదాయ దుస్తులు సహా అన్ని రకాల దుస్తులు కేవలం..
ఢిల్లీ, సెప్టెంబర్ 26: విద్యార్థులకు, ఫ్యాషన్ ప్రియులకు, షాపింగ్ ఔత్సాహికులకు.. అదిరిపోయే న్యూస్ ఇది. అవును, కొత్త కొత్త దుస్తులు, ట్రెండ్‌కు తగ్గ దుస్తులు ధరించాలనుకునే వారికోసం నిజంగా అదిరిపోయే న్యూస్ ఇది. జీన్స్, టాప్స్, కుర్తాలు, సంప్రదాయ దుస్తులు సహా అన్ని రకాల దుస్తులు కేవలం 100, 200 రూపాయలకే ఇక్కడ లభిస్తాయి. మరి ఇంత తక్కువ ధరకు దుస్తులు ఎక్కడ లభిస్తాయో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దుస్తులకు చాలా ధర ఉంటుంది. రిటైల్ షాపుల్లో పిల్లలకు గానీ, పురుషులకు గానీ మహిళలకు గానీ దుస్తులు తీసుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల మాత్రం అతి తక్కువ ధరకే మంచి మంచి దుస్తులు కొనుగోలు చేయొచ్చు. అవును, తక్కువ ధరకే నాణ్యమైన, ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సులు లభించే మార్కెట్స్ గురించే ఈ కథనం.
మన దేశంలో ఎన్నో నగరాల్లో తక్కువ ధరకే నాణ్యమైన దస్తులు విక్రయించే మార్కెట్లు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా ఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్ పేరు వినిపిస్తుంది. ఇక్కడ దుస్తుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. 20 నుంచి 50 రూపాయలకే టీషర్ట్స్, టాప్‌లు లభిస్తాయి. రూ. 200 లకే ట్రెండీ, బడ్జెట్ ఫ్రెండ్లీ జీన్స్ డ్రెస్సులను కొనుగోలు చేయవచ్చు. ఇవే కాదు.. సంప్రదాయ దుస్తులు, కుర్తాలు, హ్యాండ్ బ్యాగ్‌లు వంటివి కూడా అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలందరూ ఢిల్లీలోని సరోజినీ నగర్‌కు వెళ్లలేరు కదా. అందుకే.. మరికొన్ని నగరంల్లో తక్కువ ధరకే డ్రెస్సులు లభించే మార్కెట్ల గురించి కూడా తెలుసుకుందాం.
కొలాబా కాజ్‌వే, ముంబై..
ముంబై నగర వాసులకు ఇష్టమైన మార్కెట్ కొలాబా కాజ్‌వే. ఇది కొనుగోలుదారులకు స్వర్గధామం. ట్రెండీ డ్రెస్సెస్ ఇక్కడ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. డ్రెస్సులతో పాటు నగలు, బ్యాగులు, పాదరక్షలు, ఇతర ఉపకరణాల వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇక కొనుగోలు సమయంలో బేరాలాడటం సర్వసాధారణం. ఈ విషయంలో మీరు మంచి నైపుణ్యం ప్రదర్శించినట్లయితే.. తక్కువ ధరకే మంచి మంచి వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ మార్కెట్‌లో స్టూడెంట్స్ నుంచి పర్యాటకుల వరకు అందరికి అవసరమైనవి లభిస్తాయి.
సూరత్ వస్త్ర మార్కెట్..
వస్త్రాలకు గుజరాత్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ వస్త్ర వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ మార్కెట్‌లలో అతి తక్కువ ధరకే డ్రెస్‌లు లభిస్తాయి. ఒక్కసారి ఇక్కడికి వెళ్లి షాపింగ్ చేస్తే.. అక్కడి నుంచి అస్సలు రావాలని అనిపించదంటే అతిశయోక్తి కాదు. సూరత్‌లో దుస్తులు చాలా చౌక ధరకే లభిస్తాయి. తక్కువ ధరకే ఎక్కువ డ్రెస్సులు కొనుగోలు చేయాలని భావించే వారికి సూరత్ ఎంతో అనువైన ప్రాంతం. బడ్జెట్ ఫ్రెండ్లీ, డిజైనర్ డ్రెస్సులు ఇక్కడ లభిస్తాయి.
కమర్షియల్ స్ట్రీట్, బెంగళూరు..
బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ ట్రెండీ, ట్రెడిషనల్ డ్రెస్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. ఇక్కడ ఎంత బేరమాడితే అంత బెనిఫిట్ పొందుతారు. చిక్‌పేట్ మార్కెట్ కూడా దుస్తుల హోల్ సేల్ మార్కెట్‌కు ప్రసిద్ధి చెందింది. సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, పెళ్లి దుస్తులు సహా అనేక రకాల డ్రెస్సులు చాలా తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయి.
బాపు బజార్, జైపూర్..
రాజస్థాన్ కూడా వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా జైపూర్‌లో డ్రెస్సులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. రాజస్థానీ కల్చర్ డ్రెస్సులు, లెహంగాలు, దుపట్టాలు, బంధనీ ప్రింట్ చీరలు, సంప్రదాయ దుస్తులు, ట్రెండీ డ్రెస్సెస్ కూడా అతి తక్కువ ధరకే బాపు బజార్‌లో లభిస్తాయి. ఇక్కడ డ్రెస్సులతో పాటు.. ఇతర వస్తువులు, గృహోపకరణాలు సైతం భారీ స్థాయిలో విక్రయిస్తారు. ఇక్కడ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కొనుగోలు సమయంలో బేరమాడే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read:
Benefits of Pumpkin Flowers: గుమ్మడికాయే కాదు.. దాని పువ్వు కూడా ఆరోగ్యానికి నిధి
Heavy Rain Alert: మళ్లీ భారీ వర్షాలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
For More Lifestyle News and Telugu News..