Chanakya Niti On Marriage: జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించండి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 03:23 PM
జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించాలని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. కాబట్టి, భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఏ విషయాలను పరిగణించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మంచి జీవిత భాగస్వామి ఉంటేనే వివాహ జీవితం అందంగా ఉంటుంది. లేదంటే, అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. అందుకే, భాగస్వామిని ఎంచుకునేటప్పుడు, మీరు వారి అందాన్ని మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. భాగస్వామిని ఎంచుకునే ముందు ఏ విషయాలపై శ్రద్ధ వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్షణాలపై దృష్టి పెట్టండి: చాలా మంది బాహ్య సౌందర్యం ఆధారంగానే తమ జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. కానీ, అందం కన్నా మంచి గుణం ముఖ్యం. అందంతో పాటు వ్యక్తిత్వం, ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కుటుంబ విలువలు:
వివాహానికి ముందు, మీరు ఎంచుకునే భాగస్వామి కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాముఖ్యత, కుటుంబ సభ్యులను ఎలా చూస్తారు, తమ పెద్దలను గౌరవిస్తారా లేదా మొదలైన వాటి గురించి మీరు తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
ఓపిక ఉందో లేదో చెక్ చేయండి:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, కోపంగా ఉండే స్వభావం ఉన్న భాగస్వామిని ఎంచుకోవడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అసంతృప్తికి దారితీయవచ్చు. మీరు ఎంచుకునే భాగస్వామిలో ఓపిక ఉందో లేదో చెక్ చేయండి.
మంచి మర్యాదలు:
విలువలు లేని వ్యక్తి అహంకారిగా ఉంటారని, అలాంటి వ్యక్తి తన భాగస్వామిని కూడా గౌరవించలేరని చాణక్యుడు వివరించారు. మంచి మర్యాదలు ఉన్న వారిని భాగస్వామిగా ఎంచుకోండి.
దయ : ఆచార్య చాణక్యుడి ప్రకారం, దయగల స్వభావం ఉన్న వ్యక్తి ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు. తన భాగస్వామి భావాలను గౌరవిస్తారు. అందుకే, ఈ లక్షణాలు ఉన్న భాగస్వామిని ఎంచుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..
Read Latest AP News And Telugu News