Chanakya Neeti On Lucky people: ఇలాంటి వారు నిజంగా అదృష్టవంతులు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:47 PM
చాలా మంది సంపద ఉన్నవారు అదృష్టవంతులని అనుకుంటారు. కానీ, చాణక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులు మాత్రమే భూమిపై నిజంగా అదృష్టవంతులు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది లగ్జరీ లైఫ్, ఫ్రెండ్స్, మంచి శాలరీ, ఆస్తి, పేరు, హోదా ఇవన్నీ ఉంటేనే అదృష్టవంతులని అనుకుంటారు. అలా అన్నీ ఉంటేనే జీవితంలో సంతోషంగా ఉండగలమని అనుకుంటారు. ఇవి లేకుండా అస్సలు సంతోషంగా ఉండలేమని భావిస్తారు. కానీ, ఆచార్య చాణక్యుడు మాత్రం.. ఇలాంటి వారు మాత్రమే భూమిపై నిజంగా అదృష్టవంతులని తన నీతి శాస్త్రంలో అంటున్నారు.
గుణవంతులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, సద్గుణవంతులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అలాంటి పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటారు. వారికి వారి పట్ల అపారమైన గౌరవం కూడా ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు.
మంచి భార్యను పొందిన వారు:
భార్య కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు.. ఇంట్లో శాంతి, శ్రేయస్సుకు పునాది అని చాణక్యుడు చెప్పాడు. తన భర్తను అర్థం చేసుకునే, ప్రతి అడుగులో అతనికి తోడుగా నిలిచే భార్యను పొందిన వ్యక్తి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.
సంతృప్తిగా జీవితాన్ని గడిపేవారు:
దేనికీ అత్యాశ లేకుండా, ఇతరులపై అసూయపడకుండా, తనకున్న దానితో సంతోషంగా ఉండే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. జీవితం గురించి దిగులుగా ఉండడు. అందుకే, తనకున్న దానితో సంతృప్తి చెందాలని చాణక్యుడు చెప్పాడు.
ఇవీ చదవండి:
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
For More Latest News