Share News

Yoga For Better Sleep: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. ఈ 5 ఆసనాలు చేయండి

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:16 PM

చాలా మంది రాత్రిళ్లు నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే, అలాంటి వారు పడుకునే ముందు ఈ 5 యోగా ఆసనాలు చేస్తే త్వరగా నిద్రపోతారని యోగా నిపుణులు చెబుతున్నారు.

Yoga For Better Sleep: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. ఈ 5 ఆసనాలు చేయండి
Yoga For Better Sleep

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం, ఎందుకంటే నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది, కణాలను మరమ్మత్తు చేస్తుంది. మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లోపాలు వంటివి కలుగుతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా మంది రాత్రిళ్లు నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే, అలాంటి వారు పడుకునే ముందు ఈ 6 యోగా ఆసనాలు చేస్తే త్వరగా నిద్రపోతారని యోగా నిపుణులు చెబుతున్నారు.


బాలసనం

బాలసనం (పిల్లల భంగిమ) శరీరానికి, మనస్సుకు విశ్రాంతినిస్తుంది. దీనిని చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది. వెన్ను, భుజాలు, మెడ నొప్పి నుండి కూడా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాకుండా, లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది.

Balasanam.jpg


విపరీత కరణి

ఈ ఆసనం విశ్రాంతి, ఒత్తిడి నుండి ఉపశమనం అందిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది నిద్రను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

Sleep (1).jpg


ఉత్తానాసనం

ఈ యోగా భంగిమ మీరు నిటారుగా నిలబడి ముందుకు వంగి, మీ తలను మీ పాదాల వైపు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నరాలు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

yoga.jpg


మార్జర్యాసన-బిటిలాసనం

ఈ యోగా భంగిమను పిల్లి-ఆవు భంగిమ అని కూడా అంటారు. ఇది మంచి నిద్రకు సహాయపడటమే కాకుండా శరీరాన్ని వేడెక్కించడానికి కూడా సహాయపడుతుంది. శరీరానికి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. వెన్నునొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Yoga (1).jpg


శవాసనం

శవాసనం అనేది యోగాలో ఒక విశ్రాంతి భంగిమ. దీనిని శవ భంగిమ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో శరీరాన్ని శవంలా కదలకుండా నేలపై పడుకోబెట్టాలి. ఇది శారీరక, మానసిక అలసటను తగ్గించి, ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడుతుంది.

Sleep (2).jpg


Also Read:

కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు.. వాటిని ఇలా గుర్తించండి?

ప్రసవం వల్ల తల్లి ఆయుష్షు తగ్గుతుందా?

For More Latest News

Updated Date - Dec 03 , 2025 | 05:18 PM