Maternal Health After Delivery: ప్రసవం వల్ల తల్లి ఆయుష్షు తగ్గుతుందా?
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:05 PM
ప్రసవించిన తర్వాత తల్లి జీవితకాలం తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రసవం అంటే మహిళకు మరో జన్మ లాంటిదని అంటారు. ఎందుకంటే, ఆ తల్లి అంతగా కష్టాన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది. అయితే, ప్రసవం తల్లి జీవితకాలాన్ని తగ్గిస్తుందని కొంత మంది భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల ఆయుష్షు తగ్గే అవకాశం ఉంది. ప్రసవం స్త్రీ జీవితకాలాన్ని దాదాపు ఆరు నెలలు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులలో నివసించే స్త్రీలలో ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
మహిళలు తమ శక్తిలో ఎక్కువ భాగాన్ని గర్భం దాల్చడానికి, ప్రసవానికి కేటాయిస్తున్నారని, ఇది వారి శరీర కణాలు బలంగా మారకుండా నిరోధిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే, ప్రసవ సమయంలో పర్యావరణం స్త్రీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను కనడం వల్ల కలిగే ఒత్తిడి మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. తల్లులకు గుండె జబ్బులు, జీవక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని బరువు పెరగడం, శారీరక ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. మహిళలు వరుసగా పిల్లలకు జన్మనిచ్చినప్పుడు లేదా కరువు వంటి చాలా క్లిష్ట పరిస్థితులలో జన్మనిచ్చినప్పుడు వారి ఆయుష్షు ఆరు నెలలు తగ్గుతుందని ఇటీవల జరిగిన ప్రదేశాల్లో వెల్లడైంది.
Also Read:
ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?
విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పాటించాల్సిన టిప్స్
For More Latest News