Xi Jinping: టంప్ సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందాం
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:22 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల రూపంలో విసురుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్...
బ్రిక్స్ దేశాలకు జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్, సెప్టెంబరు 8: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల రూపంలో విసురుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ దేశాల నేతలకు పిలుపునిచ్చారు. ట్రంప్ ప్రకటించిన సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ అమెరికా దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ నేతల సదస్సు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగింది. దీనిని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ప్రసంగిస్తూ ఆధిపత్యవాదం, ఏకపక్ష వాదం, రక్షణవాదం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఇవి వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తున్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టకుండా ఆయన ఈ విమర్శ చేశారు. అమెరికా ప్రాబల్యానికి వ్యతిరేకంగా ఆయన గ్లోబల్ గవర్నెస్ ఇనిషియేటివ్ (జీజీఐ)ని ప్రతిపాదించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఆర్థిక విధానాలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News