Share News

Minuteman-3: భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా.. వీడియో వైరల్

ABN , Publish Date - May 22 , 2025 | 10:41 AM

ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలిగే మినిట్ మ్యాన్-3 క్షిపణిని అమెరికా తాజాగా పరీక్షించింది.

Minuteman-3: భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా.. వీడియో వైరల్
Minuteman III missile test

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తాజాగా భారీ ఖండాతర క్షిపణిని పరీక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా నెట్టింట షేర్ చేసింది. ఆయుధ సంపత్తిలో తనకు సాటి రాగల వారెవ్వరూ లేరని చాటుకునే ప్రయత్నం చేసింది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది.

ఈ ఖండాంతర క్షిపణి పేరు మినిట్ మ్యాన్-3. కాలిఫోర్నియాలోని వాండెన్‌‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ క్షిపణి మొత్తం 6760 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యం చేరుకున్నట్టు తెలిపారు.


గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ మిసైల్.. నిర్దేశించిన లక్ష్యం మేరకు యూఎస్ ఆర్మీ స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రయోగ ప్రాంతానికి చేరింది. ఆస్ట్రేలియాలోని మార్షల్ ఐలాండ్స్‌లో ఈ ప్రయోగ కేంద్రం ఉంది. ప్రయోగం విజయవంతమైన అనంతరం అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అణు యుద్ధానికి దిగాలంటే శత్రు దేశాలు జంకేలా ఈ క్షిపణి సామర్థ్యం ప్రదర్శించామని పేర్కొంది.


అణుదాడుల ముప్పును తప్పించేందుకు అమెరికా ట్రయాడ్ ప్రోగ్రామ్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 400 ఎల్‌జీఎమ్-30జీ మినిట్ మ్యాన్-3 ఖండాంతర క్షిపణులను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించేలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. వీటిని నేలపై నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు ప్రతిస్పందనగా తాము ఈ పరీక్ష నిర్వహించలేదని అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. 1970ల్లో మొదలు పెట్టిన మినిట్ మ్యాన్-3 ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది.

Also Read:

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

విమానం గాల్లో ఉండగా పైలట్‌కు స్పృహ తప్పడంతో..

తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..

Read Latest and International News

Updated Date - May 22 , 2025 | 10:46 AM