Share News

U.S and G7 offers to help: యుద్ధ నేపథ్యంలో రంగంలోకి యూఎస్, జీ7 దేశాలు

ABN , Publish Date - May 10 , 2025 | 05:03 PM

భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలకు తమ వంతు సాయం అందిస్తామని అగ్రరాజ్యం అమెరికా, గ్రూప్ ఆఫ్ 7 దేశాలు ముందుకొచ్చాయి.

U.S and G7 offers to help: యుద్ధ నేపథ్యంలో రంగంలోకి యూఎస్, జీ7 దేశాలు
U.S and G7 offers to help:

U.S and G7 offeres assistance to India and Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ నివారణకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు "నిర్మాణాత్మక చర్చలు" ప్రారంభించాలని అమెరికా, G7 దేశాలు కోరాయి. ఇందుకోసం తాము సహాయం అందిస్తామని ప్రకటించాయి. భారత్ పాక్ ల మధ్య శాంతి కోసం కృషి చేస్తు్న్నామని US ప్రభుత్వం తెలుపగా, గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) ప్రధాన దేశాలు కూడా ఆసియా దేశాల్లో తీవ్ర వైరుధ్యాల మధ్య ప్రత్యక్ష చర్చల్లో పాల్గొని పరిష్కరించుకోవాలని సూచించాయి.

అమెరికా విదేశాంగ ముఖ్య కార్యదర్శి మార్కో రూబియో ఈ అంశంపై మాట్లాడుతూ ఏప్రిల్ చివరి నుండి భారత్, పాకిస్తాన్ రెండింటితో క్రమం తప్పకుండా చర్చలు జరిపి ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే శనివారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో రూబియో చేసిన ఫోన్ కాల్స్‌కు సంబంధించి యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మూడు ప్రకటనలను విడుదల చేసింది.

భవిష్యత్తులో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి "నిర్మాణాత్మక చర్చలు ప్రారంభించడంలో" యుఎస్ తగిన సహాయం అందిస్తుందని రూబియో ఇరుదేశాలకు చెప్పినట్టు సదరు స్టేట్మెంట్లో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుద్ధం "మా పని కాదు" అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్న మాటల్ని కూడా ఈ సందర్భంగా అమెరికా ఉటంకిస్తోంది.

మరోవైపు, ఏప్రిల్ 22న కశ్మీర్‌లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు(G7) ఒక​ప్రకటనలో తెలిపారు. ఇరుదేశాలు "ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని, శాంతియుత పరిష్కారం కోసం రెండు దేశాలు ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నామని G7 అగ్ర దౌత్యవేత్తలు ప్రకటించారు.

దశాబ్దాల నాటి భారత్-పాకిస్తాన్ శత్రుత్వం తారా స్థాయికి చేరడం మంచిది కాదని, నిర్మాణాత్మక శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని కూడా జీ7 దేశాలు చెప్పాయి. బుధవారం నుంచి మొదలైన భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఇరుదేశాలు ప్రతీరోజూ ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా డజన్ల కొద్దీ ప్రాణాలు పోయాయి.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: పాకిస్తాన్‎ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..

Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


షేక్ జైద్ ఎయిర్ పోర్ట్.. ఎక్స్‌క్లూజివ్ విజువల్స్

Updated Date - May 10 , 2025 | 05:08 PM