USA Issues Strict Warning: భారతీయులకు అమెరికా కీలక సూచనలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:29 AM
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా..తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్‌లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అనుసరిస్తోన్న కఠిన విధానాలతో భారతీయులతో సహా ఇతర దేశాలకు చెందిన వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతరత్రా నిబంధనలతో ఇప్పటికే హెచ్-1బీ, హెచ్-4 వీసా(H1B Visa News) అపాయింట్‌మెంట్లు ఆలస్యమవుతుండటంతో భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండే భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికఅగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలు అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు భారత్‌లోని అమెరికా ఎంబసీ ట్వీట్( Indians In USA Warning) చేసింది.
ఇది ఇలా ఉండగా.. హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా..తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్‌లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ఇది వర్తించనుంది. ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఉన్నట్లుగా ర్యాండమ్‌గా హెచ్-1బీ వీసాలు (H-1B Visa) జారీ చేయరు. దీని ప్రభావం అనేక మంది వలసదారులపై పడనుంది. ఈ వీసాను అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉండనుంది. ఈ కొత్త రూల్ కోసం హెచ్-1బీ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా కార్మిక శాఖ క్రమబద్ధీకరించింది.
ఇవీ చదవండి:
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..