Share News

MEA on Trump Comments: భారత్‌ను కోల్పోయామంటూ ట్రంప్ కామెంట్స్.. కేంద్రం రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 10:12 PM

భారత్‌ను కోల్పోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్‌ గురించి స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ఈ అంశంలో ప్రస్తుతానికి మాట్లాడేందుకు ఏమీ లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.

MEA on Trump Comments: భారత్‌ను కోల్పోయామంటూ ట్రంప్ కామెంట్స్.. కేంద్రం రియాక్షన్ ఏంటంటే..
MEA on Trump Social Media Comments

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ను కోల్పోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ట్రంప్ పోస్టుపై ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ చేయలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు (MEA response Trump viral remark).

అమెరికాతో బంధం భారత్‌కు ఎంతో ముఖ్యమని రణధీర్ జైస్వాల్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల బంధం గతంలో ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలిచిందని గుర్తు చేశారు. భారత్, అమెరికా గతంలో ఉమ్మడిగా పేర్కొన్న సమగ్ర ఎజెండాకు కట్టుబడి ఉన్నామని తెలిపారు (SCO summit Modi Putin Xi).


ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర గౌరవం ఆధారంగా ఈ బంధం ముందుకు సాగుతుందని కామెంట్ చేశారు. అమెరికాతో బంధం బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ దిశగా క్వాడ్ కూటమి ఓ మేలైన వేదిక అని వ్యాఖ్యానించారు. ఇక ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని అన్నారు. వీలైనంత త్వరగా ఈ యుద్ధం ముగిసిపోవాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు.

భారత్, రష్యాలను చైనాకు కోల్పోయామంటూ ట్రంప్ ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశాల భవిష్యత్తు బాగుండాలని కూడా కోరుకుంటున్నట్టు కామెంట్ చేశారు. షాంఘాయ్ సహకార సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌ల ఫొటోను షేర్ చేస్తూ ట్రంప్ ఈ కామెంట్ చేశారు. దీంతో, ఈ పోస్టుపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

పంజాబ్‌లో వరద బాధితులకు అండగా సెలబ్రిటీలు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

For More National News and Telugu News

Updated Date - Sep 05 , 2025 | 10:18 PM