Gunther Fehlinger Account Ban: భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
ABN , Publish Date - Sep 05 , 2025 | 03:32 PM
భారత్‌ను ముక్కలు చేయాలంటూ ఎక్స్ వేదికగా వివాదాస్పద పోస్టు పెట్టిన ఆస్ట్రియా ఆర్థికవేత్త గుంటర్ ఫేలింగర్ అకౌంట్ నిషేధానికి గురైంది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్.. ఆయన అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ను ముక్కలు చేయాలంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన ఆస్ట్రియా ఆర్థికవేత్త గుంటర్ ఫేలింగర్-యాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత్‌లో ఆయన ఎక్స్ అకౌంట్‌పై నిషేధం విధించింది. ఫేలింగర్ అభ్యంతకర పోస్టు గురించి హోమ్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు ఎక్స్ దృష్టికి తీసుకెళ్లాయి. భారత్‌లో ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అభ్యర్థించాయి (Gunther Fehlinger X account banned).
ఈ విషయంపై విదేశాంగ శాఖ వర్గాలు కూడా స్పందించాయి. ఈ వివాదాన్ని ఆస్ట్రియా ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. గుంటర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపాయి. ఆయనో మూర్ఖుడని వ్యాఖ్యానించాయి. ఆయనకు అధికారిక పదవులు ఏవీ లేవని కూడా పేర్కొన్నాయి (Austrian economist India controversy).
భారత్‌ను ముక్కలు చేసి ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలంటూ గుంటర్ అంతకుముందు పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. భారత ప్రధానిని రష్యా మనిషి అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనాలు నెట్టింట మండిపడ్డారు. ఉక్రెయిన్, కొసోవో, బోస్నియా, ఆస్ట్రియా దేశాల నాటో సభ్యత్వ పరిశీలనకు ఉద్దేశించిన ఓ కమిటీకి ఫేలింగర్ అధ్యక్షుడిగా ఉన్నారు. బాల్కన్ దేశాల ఆర్థిక రంగ ఏకీకరణకు ఉద్దేశించిన మరో యాక్షన్ గ్రూప్‌లో బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు (MEA reaction Fehlinger-Jahn).
ఇక ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది జులైలో తొలిసారిగా ఆస్ట్రియాలో పర్యటించారు. దాదాపు 41 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడంతో నాటి టూర్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని, ఆస్ట్రియా పర్యటన చేపట్టారు.
ఇవి కూడా చదవండి
భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News