Donald Trump Warning To India: మళ్లీ భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కిన ట్రంప్.. స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:31 PM
భారత్‌పై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.
వాషింగ్టన్, ఆగస్ట్ 04: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. భారత్‌పై మరిన్నీ ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా నుంచి కారు చౌకగా చమురును భారత్ కొనుగోలు చేస్తోందన్నారు. ఆ చమురును భారత్ మళ్లీ విక్రయిస్తుందని చెప్పారు. ఇలా బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించడం ద్వారా భారత్ లాభాలు గడిస్తుందని తెలిపారు.
ఇలా భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యాకు అధిక మొత్తంలో ఆర్థిక వనరులు చేకూరతున్నాయని పేర్కొన్నారు... ఆ క్రమంలోనే ఉక్రెయిన్‌తో ఆ దేశం అంటే రష్యా యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. అంతేకాదు.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు.
ఇవేమీ భారత్ పట్టించుకోట్లేదని మండిపడ్డారు. అందులోభాగంగానే టారిఫ్‌లు విధిస్తున్నామన్నారు. ఇక రష్యాకు భారత్ పూర్తిగా సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌ను ట్రంప్ విధించిన విషయం విదితమే.
For More International News And Telugu News