US Canada Trade War: ముదిరిన వాణిజ్య యుద్ధం.. కెనడా దిగుమతులపై సుంకాన్ని పెంచిన ట్రంప్
ABN , Publish Date - Mar 11 , 2025 | 09:46 PM
డొనాల్డ్ కెనడాపై మరోసారి రెచ్చిపోయారు. కెనడా నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాతో ఢీ అంటే ఢీ అంటున్న ట్రంప్ మరోసారి సుంకాల కొరడా ఝళిపించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులు అన్నింటిపైనా సుంకాన్ని 50 శాతానికి పెంచేందుకు నిర్ణయించారు. అమెరికాకు ఎగుమతి చేసే విద్యుత్‌పై కెనడా 25 శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. ‘‘అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా బాగమైతేనే మంచిది. దీంతో, సుంకాలన్నీ తొలగిపోతాయి. అంతా మాయవుతాయి’’ అని ట్రంప్ కామెంట్ చేశారు.
USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ
కెనడా దిగుమతులపై సుంకాలు పెంచడం, అమెరికాలో భాగం కావాలంటూ పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కోరడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. కెనడాతో వాణిజ్యంలో సమతౌల్యం పేరిట ఇప్పటికే అమెరికా విధించిన పలు సుంకాలు గతం వారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, కెనడా మాత్రం వెనక్క తగ్గేదే లేదని స్పష్టం చేసింది. ప్రతీకార సుంకాల తప్పవని హెచ్చరించిన కెనడా ప్రభుత్వం ఆ మేరకు తనదైన దూకుడుతో ముందుకెళుతోంది.
Helicopter Crash: కుప్పకూలిన మరో హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ఈ క్రమంలో ఒటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డు మాట్లాడుతూ అమెరికాకు ఎగుమతి చేసే విద్యుత్‌పై 25 శాతం సర్‌చార్చి విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ ఆర్థిక విధానాలను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఆయన ఫోర్డ్ ఈ సందర్భంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. అమెరికా ఈ వివాదాన్ని పెద్దది చేస్తే నేను విద్యు్త్ కోత విధించేందుకు కూడా వెనకాడను’’ అని అన్నారు. కెనడా విద్యుత్.. అమెరికాలోని 1.5 మిలియన్ల కుటుంబాలు వ్యాపారాలకు సరఫరా అవుతూందని అన్నారు. సర్జ్‌చార్జ్ కారణంగా వారిపై రోజుకు 279,000 డాలర్ల భారం పడుతుందిన అన్నారు. ఇక అమెరికా వాణిజ్య విధానాలపై అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
Read More International News and Latest Telugu News