Share News

Trump Declares Crime Emergency: వాషింగ్టన్‌లో నేర అత్యయిక స్థితి

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:18 AM

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నేరాలు పెరిగిపోతున్నా యంటూ.. ‘నేర అత్యయిక స్థితి’ని ప్రకటిస్తూ ఆ...

Trump Declares Crime Emergency: వాషింగ్టన్‌లో నేర అత్యయిక స్థితి

వాషింగ్టన్‌, ఆగస్టు 12: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నేరాలు పెరిగిపోతున్నా యంటూ.. ‘నేర అత్యయిక స్థితి’ని ప్రకటిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో వాషింగ్టన్‌ డీసీలోని ఫెడరల్‌ భవనాలు, ఆస్తులు, జాతీయ స్మారకాల భద్రత కేంద్రం పరిధిలోకి వస్తుంది. నగర మేయర్‌, మెట్రోపాలిటన్‌ పోలీసులను ట్రంప్‌ తన అదుపాజ్ఞల్లో ఉంచుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే.. ట్రంప్‌ తన అధికారాలను అటార్నీ జనరల్‌కు దఖలుపరిచారు. అటార్నీ జనరల్‌ పరిస్థితులను పర్యవేక్షించి, పరిస్థితులపై నివేదికలను అధ్యక్షుడికి అందజేస్తారు.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:18 AM