Share News

Mexico accident: మెక్సికోలో బస్సును ఢీకొట్టిన ట్రక్కు

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:29 AM

బస్సులో మంటలు చెలరేగి 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు.

Mexico accident: మెక్సికోలో బస్సును ఢీకొట్టిన ట్రక్కు

మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనం

మెక్సికో సిటీ, ఫిబ్రవరి 9: దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్‌ నుంచి టబాస్కోకు వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దాంతో బస్సులో మంటలు చెలరేగి 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ కూడా ఈ ఘటనలో చనిపోయినట్లు వారు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 05:07 AM