Tariff On Mexico: మెక్సికోపై సుంకాల విధింపును నెల రోజుల పాటు వాయిదే వేసిన డొనాల్డ్ ట్రంప్!
ABN , Publish Date - Feb 03 , 2025 | 10:12 PM
మెక్సికో ఉత్పత్తులపై సుంకాల విధింపును నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మెక్సికో ప్రెసిడెంట్‌తో సానుకూల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల విధింపు నుంచి మెక్సికోకు స్వల్ప ఊరట లభించింది. సుంకాల అమలను నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ఇరు దేశాల నేతలు పేర్కొన్నారు. సోమవారం ట్రంప్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఫోన్‌లో సుంకాల విషయమై స్నేహపూర్వక చర్చలు జరిపారు. అనంతరం, మెక్సికో అధ్యక్షురాలు ఓ ప్రకటన విడుదల చేశారు. సుంకాల విధింపును ట్రంప్ నెల రోజుల పాటు వాయిదా వేశారి పేర్కొన్నారు. తమ మధ్య సహృద్భావ సంభాషణ సాగిందని వ్యాఖ్యానించారు (Donald Trump).
Donald Trump: అమెరికా సబ్సిడీలు లేకపోతే కెనడా ఓ దేశంగా మనలేదు: డొనాల్ట్ ట్రంప్
ఇక అమెరికా గతంలో ప్రస్తావించిన అనేక డిమాండ్లపై కూడా మెక్సికో అధ్యక్షురాలు స్పందించారు. మెక్సికో నుంచిఅమెరికాకు మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర సరిహద్దు వెంబడి 10 వేల మంది నేషనల్ గార్డు సైనికులను మోహరిస్తామని పేర్కొన్నారు. అమెరికాలోకి తుపాకీ సంస్కృతి, వ్యవస్థాగత నేరాలకు అడ్డుకట్టే వేసేలా హై పవర్డ్ తుపాకుల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Donald Trump: ట్రంప్ సుంకాల కొరడా
ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. సుంకాల విధింపును నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు తాము పరస్పర అంగీకారానికి వచ్చినట్టు పేర్కొన్నారు. మెక్సికోతో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ సారథ్యంలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ శనివారం ప్రకటించిన కలకలం రేపిన విషయం తెలిసిందే. చైనా, కెనడా ఉత్పత్తులపై కూడా 10 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ఇది కీలకమని వ్యాఖ్యానించారు. మరోవైపు, ట్రంప్‌పై కెనడా నిప్పులు చెరిగింది. తామూ అమెరికా ఉత్పత్తులపై సుంకం విధించబోతున్నట్టు పేర్కొంది.
Read Latest and International News