Donald Trump: అమెరికా సబ్సిడీలు లేకపోతే కెనడా ఓ దేశంగా మనలేదు: డొనాల్ట్ ట్రంప్
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:17 PM
అమెరికా సాయం లేకుండా కెనడా ఓ దేశంగా మనజాలదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో అమెరికాలో విలీనం కావాలని మరోసారి పునరుద్ఘాటించారు.

ఇంటర్నెట్ డెస్క్: కెనడా అమెరికాలో విలీనం కావాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే కెనడాపై సుంకాలు వడ్డించి మిత్ర దేశానికి చికాకు పెడుతున్న ట్రంప్ తాజాగా మరోసారి పాత పాట పాడారు. అమెరికా ఇచ్చే సబ్సిడీలు లేకపోతే కెనడా ఓ దేశంగా మనలేదని అన్నారు. వందల బిలియన్ల డాలర్లను అమెరికా కెనడాకు సబ్సిడీల రూపంలో అందిస్తోందంటూ ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును ప్రస్తావించారు.
‘‘కాబట్టి కెనడ అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలి. దీంతో, కెనడాకు పన్నుల భారం తగ్గడంతో పాటు అక్కడి ప్రజలకు అమెరికా మిలిటరీ రక్షణ లభిస్తుంది’’ అని అన్నారు (Donald Trump).
Car accident: ఐర్లాండ్‌లో కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
కాగా, ట్రంప్ తీరుపై కెనడాలో తీవ్ర ఆగ్రాహేశాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సుంకాలపై ప్రతి చర్యలు ఉంటాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వార్నింగ్ ఇచ్చారు. ఎంపిక చేసిన అమెరికా దిగుమతులపై తాము 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, తొలి దశ సుంకాల విధింపు మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. మిగతా సుంకాలను విడతల వారీగా విధిస్తారని తెలుస్తోంది. ఇదెలా ఉంటే కెనడాలోని ప్రావిన్సులు కూడా అమెరికా సుంకాలపై ప్రతిచర్యలకు దిగుతున్నాయి. అమెరికా లిక్కర్ కొనుగోళ్లపై తక్షణం నిషేధం విధిస్తున్నట్టు కొన్ని ప్రావిన్సులు పేర్కొన్నాయి.
Donald Trump: ట్రంప్ సుంకాల కొరడా
ఇక శనివారం నాడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడాల ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. మూడు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్నా ట్రంప్ లెక్కచేయలేదు. ఇక చైనా ఉత్పత్తులపై కూడా 10 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ ఈ సుంకాలను విధించారు. కాగా, ట్రంప్ సుంకాల బాధిత దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య యుద్ధాలతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు స్వల్పకాలంలో అమెరికా వినియోగదారులపై ధరాభారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Latest and International News