Share News

Taliban tanks: అవి పాకిస్థాన్ యుద్ధ ట్యాంకర్లేనా.. అఫ్గాన్ వీధుల్లో ర్యాలీ.. పాక్ మంత్రి ఏమన్నారంటే..

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:46 PM

కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో అట్టుడికిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాలిబన్ల వినతి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ విన్నపం మేరకే తాము కాల్పుల విరమణకు ఓకే అన్నామని తాలిబన్లు ప్రకటించారు.

Taliban tanks: అవి పాకిస్థాన్ యుద్ధ ట్యాంకర్లేనా.. అఫ్గాన్ వీధుల్లో ర్యాలీ.. పాక్ మంత్రి ఏమన్నారంటే..
tanks racing video

కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో అట్టుడికిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాలిబన్ల వినతి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ విన్నపం మేరకే తాము కాల్పుల విరమణకు ఓకే అన్నామని తాలిబన్లు ప్రకటించారు. కాల్పుల విరమణకు ముందు ఇరు దేశాల బలగాలు బుధవారం పలుచోట్ల పరస్పర దాడులకు తెగబడ్డాయి. బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది (Taliban vs Pakistan).


కాల్పుల విరమణకు ముందు అఫ్గాన్‌లోని ఆగ్నేయ స్పిన్ బోల్డాక్ ప్రావిన్స్ వీధుల గుండా యుద్ధ ట్యాంకులు ర్యాలీగా వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి (Afghan streets tank video). బుధవారం సరిహద్దు ఘర్షణల సమయంలో అఫ్గాన్ దళాలు పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను చంపాయని, ఆ దేశ ఆయుధాలు, ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. అయితే, తాలిబన్ వాదనను పాకిస్తాన్ ఖండించింది.


పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. 'వారు పాక్ యుద్ధ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్టు కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. పాక్ సైన్యం దగ్గర అలాంటి ట్యాంకర్లు లేవు. వారు బహుశా వాటిని ఎవరో చెత్త వ్యాపారి నుంచి కొనుగోలు చేసి ఉండవచ్చు' అని పేర్కొన్నారు (Pakistan Taliban conflict). బుధవారం జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.


ఇవి కూడా చదవండి:

రష్యా చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

టైమ్‌ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 03:46 PM