Share News

Starship 11th Test Flight: స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతం.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 14 , 2025 | 08:42 AM

స్పెస్ ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్ షిప్ 11వ ప్రయోగం విజయవంతమైంది. సూపర్ హెవీ బూస్టర్‌ను నియంత్రిత విధానంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర తీరంలో కూల్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Starship 11th Test Flight: స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతం.. వీడియో వైరల్
SpaceX Starship test

ఇంటర్నెట్ డెస్క్: స్పెస్ ఎక్స్ (SpaceX) సంస్థ తాజాగా నిర్వహించిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలో అత్యంత భారీ రాకెట్‌గా పేరు పడ్డ స్టార్ షిప్‌ను అంగారక గ్రహంపై మానవ సహిత అంతరిక్షయానం కోసం అభివృద్ధి చేస్తున్నారు. వ్యోమనౌకను పునర్ వినియోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా 11వ పరీక్షను నిర్వహించారు. టెక్సాస్‌లోని స్టార్ బేస్ కేంద్రం (Star Base) నుంచి స్టార్ షిప్ వ్యోమనౌకను సూపర్ హెవీ బూస్టర్ సాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించారు. నింగికెగసిన కొద్ది సేపటికే స్టార్ షిప్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ (Super Heavy Booster) విడిపోయింది. అనంతరం నియంత్రిత విధానంలో బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో కూల్చేశారు. ఇక శాటిలైట్ నమూనాలతో అంతరిక్షంలో దూసుకెళ్లిన స్టార్ షిప్ దిగ్విజయంగా వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం జాగ్రత్తగా హిందూ మహా సముద్రంలో పడిపోయింది (Starship 11th Test Flight).


ఇక స్టార్ షిప్‌ను లాంచ్ చేసిన సూపర్ హెవీ బూస్టర్ సముద్రంలో కూలిన దృశ్యాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. రాకెట్ కూడా నియంత్రిత విధానంలో గల్ఫ్ ఆప్ మెక్సికో సముద్ర జలాల్లో కూల్చేశారు. స్టార్ షిప్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అనంతరం బూస్టర్ జాగ్రత్తగా కిందకు దిగింది. సముద్రమట్టంపై కొద్ది మీటర్ల ఎత్తులో ఉండగా బూస్టర్ ఇంజెన్స్‌ను నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా నీటిలో పడి పేలిపోయింది. భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పునర్ వినియోగ రాకెట్‌గా స్టార్ షిప్‌ను స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తోంది. తాజా మిషన్‌లో రాకెట్ తమ అంచనాల మేర పని తీరు కనబరిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగ డాటాను పూర్తిస్థాయిలో విశ్లేషించి తుది అంచనాకు వస్తామని అన్నారు. ఇది పునర్ వినియోగ రాకెట్ అయినా ప్రయోగ అవసరాల కోసం తాజాగా రాకెట్‌ను సముద్రంలో కూల్చేశారు.

టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్.. స్పేస్‌ఎక్స్‌కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో స్టార్ షిప్ ప్రయోగాలు అనేకం విఫలమైనా దృఢ సంకల్పంతో ముందుడగు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజా ప్రయోగం విజయవంతం కావడం స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది.


ఇవి కూడా చదవండి:

అలా కావాలని చేయలేదు.. డిల్లీ ప్రెస్‌మీట్‌లో మహిళలా జర్నలిస్టులు లేకపోవడంపై తాలిబాన్ల వివరణ

మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 08:56 AM