Share News

Jerusalem Attack: జెరూసలెంలో కాల్పులు.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:11 AM

యూదుల పవిత్ర స్థలమైన ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు....

Jerusalem Attack: జెరూసలెంలో కాల్పులు.. ఆరుగురి మృతి

  • గాజాపై హరికేన్‌ తరహా దాడి చేస్తామన్న ఇజ్రాయెల్‌

జెరూసలెం, సెప్టెంబరు 8: యూదుల పవిత్ర స్థలమైన ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు. జెరూసలెంలోని రమోత్‌ జంక్షన్‌ బస్టాప్‌ వద్దకు వాహనంపై వచ్చిన ఇద్దరు పాలస్తీనా సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మృతిచెందిన ఆరుగురిలో 30 ఏళ్లలోపు వారు ముగ్గురున్నారు. ఓ గర్భిణి కూడా కాల్పుల్లో గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పులకు పాల్పడిన సాయుధులను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది. ఘటనా స్థలాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పరిశీలించారు. కాల్పుల నేపథ్యంలో జెరూసలెంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, తమ బందీలను విడిచిపెట్టకుంటే గాజాపై విరుచుకుపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ హెచ్చరించారు. హరికేన్‌ తరహాలో దాడి చేస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా హమా్‌సకు ఇదే చివరి వార్నింగ్‌ అని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:11 AM