Shubhanshu Shukla: భూమిపైకి సురక్షితంగా దిగిన శుభాంశు శుక్లా
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:25 PM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమిపైకి దిగింది. అమెరికాలో కాలిఫోర్నియా సముద్ర తీరంలో యాక్సియం 4 ల్యాండింగ్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
వాషింగ్టన్, జులై 15: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా క్షేమంగా భూమిపైకి చేరుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో యాక్సియం 4 సురక్షితంగా ల్యాండ్ అయింది. 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాంశు శుక్లా బృందం.. మంగళవారం మధ్యాహ్నం భూమిపైకి సురక్షితంగా దిగింది. యాక్సియం 4 మిషన్‌లో మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు అంతరిక్షంలోని వెళ్లిన సంగతి తెలిసిందే. మానవాళి కోసం ఈ బృందం అనేక ప్రయోగాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక వారం రోజుల పాటు వీరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.
రెండు వారాల పాటు సాగిన ఈ యాత్రలో 230 సూర్యోదయాలను శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం చూసింది. అలాగే సుమారు కోటి కిలోమీటర్ల మేర ప్రయాణించింది. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఈ బృందం వివిధ రకాల ప్రయోగాలు.. బయో మెడికల్ సైన్స్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, న్యూరోసైన్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించింది. రెండు వారాల పాటు భూమి చుట్టు దాదాపు 230 సార్లు ప్రదక్షిణలు ఈ బృందం చేసింది. ఈ లెక్కన 96.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించింది.
జూన్ 25వ తేదీన ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ యుజాన్‌స్కీ విష్నేవ్‌స్కీ, టైబోర్ కపుతో కలిసి శుభాంశు శుక్లా.. యాక్సియం- 4 మిషన్‌లో భాగంగా స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనమైన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే తొలుత ఈ అంతరిక్ష యాత్ర పలు మార్లు వాయిదా పడుతూ వస్తుంది. చివరకు జూన్ 25వ తేదీన యాక్సియం 4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది.
ఇవి కూడా చదవండి
రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం
యెమెన్‌లో కేరళ నర్సుకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా..
For More International News And Telugu News