Share News

Putin Warns: ఉక్రెయిన్‌కు మద్దతుగా దళాల్ని మోహరిస్తే సహించం

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:13 AM

ఉక్రెయిన్‌తో తమకు శాంతి ఒప్పందం కుదరటానికి ముందే ఆ దేశానికి మద్దతుగా ఎవరైనా సైనిక దళాలను మోహరిస్తే వాటిని కూడా తాము లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు..

Putin Warns: ఉక్రెయిన్‌కు మద్దతుగా దళాల్ని మోహరిస్తే సహించం

  • వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంటాం

  • మెక్రాన్‌ వ్యాఖ్యలపై పుతిన్‌ హెచ్చరిక

కీవ్‌, సెప్టెంబరు 5: ఉక్రెయిన్‌తో తమకు శాంతి ఒప్పందం కుదరటానికి ముందే ఆ దేశానికి మద్దతుగా ఎవరైనా సైనిక దళాలను మోహరిస్తే వాటిని కూడా తాము లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా శాంతి దళాల్ని మోహరించటానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల పలు యూరప్‌ దేశాల అధినేతలు పునరుద్ఘాటించిన నేపథ్యంలో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఉక్రెయిన్‌లో విదేశీ దళాల మోహరింపును తాము అంగీకరించబోమన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దానికి రష్యా పూర్తిగా కట్టుబడి ఉంటుందని, ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని పుతిన్‌ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌లు ఒడంబడిక కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపిన అనంతరం.. ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దురాక్రమణకు పాల్పడకుండా ఆ దేశంలో సైనిక దళాల్ని మోహరించటానికి 26 దేశాలు అంగీకరించాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం ఓ సదస్సులో మాట్లాడుతూ, సెక్యూరిటీ గ్యారెంటీల అమలు (దళాల మోహరింపు?) ప్రారంభమైందని, వాటి వివరాలు వెల్లడించలేనని చెప్పటం గమనార్హం.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 05:13 AM