Elon Musk: మస్క్ పిల్లలకు ‘పంచతంత్ర’!
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:15 AM
గురువారం వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్‌హౌ్‌సలో మస్క్ తన భాగస్వామి షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో తనను కలిసినప్పుడు.. తానిచ్చిన పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అమూల్య బహుమతులిచ్చిన మోదీ
వాషింగ్టన్, ఫిబ్రవరి 14: ఎలాన్ మస్క్ సంతానానికి ప్రధాని మోదీ అమూల్యమైన బహుమతులను అందజేశారు. విష్ణుశర్మ నీతికథలు ‘పంచతంత్ర’ అందులో ప్రముఖమైనది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘క్రిసెంట్ మూన్’, ది గ్రేట్ ఆర్కే నారాయణన్ కలెక్షన్స్’లను కూడా అందించారు. గురువారం వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్‌హౌ్‌సలో మస్క్ తన భాగస్వామి షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో తనను కలిసినప్పుడు.. తానిచ్చిన పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్క్‌తో అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఆవిష్కరణలపై తాను చర్చించానన్నారు.
‘కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన’ సూత్రాల ఆధారంగా దేశ పాలనకు కొత్త రూపు ఇచ్చేందుకు చేస్తున్న కృషిని వివరించినట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ కూడా ప్రధాని మోదీకి అరుదైన బహుమతి ఇచ్చారు. తన స్పేస్‌ఎక్స్ రాకెట్ హీట్‌షీల్డ్ టైల్‌ను కానుకగా ఇచ్చారు. షడ్బుజాకారంలో ఉండే ఈ సెరామిక్ టైల్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన రాకెట్ తిరిగి భూమి మీదకు వచ్చే క్రమంలో కీలకంగా మారతాయి. రాకెట్ తిరిగి భూవాతవరణంలోకి వచ్చే సమయంలో విపరీతమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఆ సమయంలో దాని నుంచే పుట్టే వేడి నుంచి ఈ సిరామిక్ టైల్స్ దానిని రక్షిస్తాయి.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.