Philippines Province: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:21 PM
ఫిలిప్పీ్న్స్‌లో భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. అయితే, భూకంపంతో సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో భారీ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతను తొలుత 7.0గా ప్రకటించిన యూఎస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ తరువాత కొద్దిగా తగ్గించింది. పలోంపాన్‌కు పశ్చిమాన సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. అయితే, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు (Central Philippines Earthquake).
అకస్మాత్తుగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే, భూకంప తీవ్రత కారణంగా సముద్రమట్టంలో స్వల్ప మార్పులు ఉంటాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. అయితే, సునామీ ముప్పు కూడా లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
ఇవి కూడా చదవండి:
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
చైనా కన్నెర్ర చేస్తే అమెరికాలో టాయిలెట్ పేపర్ కూడా ఉండదు: ఫైనాన్షియల్ ప్లానర్ కామెంట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి