Share News

Pak Airspace-Ban: పాక్ గగనతలంలోకి భారత్ విమానాల నిషేధం.. జనవరి 23 వరకూ పొడిగింపు

ABN , Publish Date - Dec 17 , 2025 | 10:28 PM

తమ గగనతలంలోకి రాకుండా భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని పాక్ జనవరి 23 వరకూ పొడిగించింది. ఇందుకు సంబంధించి నోటామ్ జారీ చేసింది.

Pak Airspace-Ban: పాక్ గగనతలంలోకి భారత్ విమానాల నిషేధం.. జనవరి 23 వరకూ పొడిగింపు
Pak Airspace Ban Extended

ఇంటర్నెట్ డెస్క్: తమ గగనతలంలోకి భారత విమానాల రాకపై విధించిన నిషేధాన్ని పాక్ మరో నెల రోజుల పాటు పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 23 వరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. పహల్గామ్ దాడి తరువాత తమ గగనతలంలోకి భారత్ విమానాలు రాకుండా పాక్ నిషేధం విధించింది. ఈ మేరకు నోటామ్‌ను(నోటీస్ టూ ఎయిర్‌మన్) జారీ చేసింది. భారత్‌కు చెందిన అన్ని విమానాలపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. భారత్ కూడా పాక్ విషయంలో ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. పరస్పర నిషేధం విధించి ఇప్పటికి 9 నెలలు గడిచిపోయాయి (pakistan airspace ban india).

పాక్ నిషేధం కారణంగా భారతీయ విమానాలు అరేబియా, మధ్య ఆదేశాల మీదుగా సుదీర్ఘ దూరాలు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో, ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా, పశ్చిమా ఆసియా ఫ్లైట్‌ల విషయంలో నిర్వహణ ఖర్చులు అధికం అయ్యాయి.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, వారం సుమారు 800 భారతీయ ఫ్లైట్స్‌పై ఈ నిషేధం ప్రభావం పడుతోంది. ఉత్తర అమెరికాకు ఫ్లైట్ సర్వీసు అందించే ఎయిర్ ఇండియా తమపై ఏటా నిషేధం కారణంగా 4000 కోట్ల మేర ఖర్చు పడుతుందని అంచనా వేసింది. 2019 లో నాలుగు నెలల పాటు కొనసాగిన నిషేధం కారణంగా భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు అన్నీ కలిపి సుమారు రూ.700 కోట్ల మేర నష్టాలను చవి చూశాయి.

అయితే, భారత్ విధించిన నిషేధంతో పాక్ ఎయిర్‌లైన్స్‌పై నామమాత్రపు ప్రభావం మాత్రమేనని తెలుస్తోంది. పాక్‌లో ప్రముఖ ఎయిర్ లైన్స్ పీఐఏ చాలా స్వల్ప సంఖ్యలో అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తుండటంతో భారత్ నిషేధాజ్ఞల ప్రభావం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ పాక్ ఇలా నిషేధం విధిస్తూ భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 18 , 2025 | 06:26 AM