Taliban Pakistan relations: 58 మంది పాక్ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్ట్‌లు స్వాధీనం: అఫ్గానిస్థాన్
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:04 PM
సరిహద్దు ఘర్షణలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
సరిహద్దు ఘర్షణలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి (Pakistan attack).
పాకిస్థాన్ పదే పదే సరిహద్దు ప్రాంతంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలకు దిగినట్టు అఫ్గానిస్థాన్ పేర్కొంది. పాక్ తమ దేశ రాజధాని కాబూల్‌లోని ఓ మార్కెట్‌పై బాంబు దాడులకు పాల్పడిందని అఫ్గాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని అఫ్గాన్ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు సమాచారం. తమ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని, 30 మంది గాయపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించింది (Taliban statement).
కాగా, అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో పాకిస్థాన్ దాడులకు దిగింది (South Asia conflict). అఫ్గానిస్థాన్‌లోని తెహ్రిక్ ఇ తాలిబన్ చీఫ్ నూర్ వాలి మొహ్సూద్ స్థావరంపై పాకిస్థాన్ యుద్ధ విమానాలతో దాడి చేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ దాడుల గురించి పాకిస్థాన్ యంత్రాంగం ఎటువంటి ప్రకటనా చేయలేదు.
ఇవి కూడా చదవండి:
అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి
అమెరికా వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు.. ట్రంప్ ఆంక్షలే కారణమా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి