Share News

US Tightens Visa Interview Rules: ఏ దేశంలో వారికి ఆ దేశంలోనే!

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:20 AM

వలసేతర వీసా(నాన్‌ ఇమ్మిగ్రెంట్‌. బీ 1 వ్యాపారం, బీ 2 పర్యాటకం ఇంటర్వ్యూలకు సంబంధించిన నిబంధలను మరింత కఠినతరం చేస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ..

US Tightens Visa Interview Rules: ఏ దేశంలో వారికి ఆ దేశంలోనే!

  • వలసేతర వీసాల ఇంటర్వ్యూలపై అమెరికా రూల్స్‌ టఫ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: వలసేతర వీసా(నాన్‌ ఇమ్మిగ్రెంట్‌).. బీ-1(వ్యాపారం), బీ-2(పర్యాటకం) ఇంటర్వ్యూలకు సంబంధించిన నిబంధలను మరింత కఠినతరం చేస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వలసేతర వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇక నుంచి వారి స్వదేశంలో లేదా, చట్టపరమైన నివాసం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు భారతీయులు సహా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తాయని, తక్షణమే అమల్లోకి వస్తాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. స్వల్ప కాలంలో ఇంటర్వ్యూలు పొందాలనుకునే వారు ఇప్పటి వరకు వారు పనిచేస్తున్న దేశాల నుంచి వలసేతర వీసాలకు దరఖాస్తు చేసుకుని, అక్కడే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. తాజా నిబంధనతో వీరు ఇకపై ఆ అవకాశాన్ని కోల్పోనున్నారు. ‘‘దరఖాస్తుదారులు వారి స్వదేశం లేదా చట్టపరమైన నివాసం ఉన్న ప్రాంతాల్లోని అమెరికా దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్‌లలో మాత్రమే ఇంటర్వూలకు అర్హులు.’’ అని ఉత్తర్వులో అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:20 AM