Share News

Nikki Haley Criticize: భారత్‌ను దూరం చేసుకోవద్దు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:05 AM

భారత్‌తో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ ఆక్షేపించారు. చైనాతో ఒకలా, భారత్‌లో

Nikki Haley Criticize: భారత్‌ను దూరం చేసుకోవద్దు

భారత్‌తో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ ఆక్షేపించారు. చైనాతో ఒకలా, భారత్‌లో ఒకలా వ్యవహరిస్తూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘రష్యా నుంచి భారత్‌ చమురును కొనుగోలు చేయవద్దు. కానీ ప్రత్యర్థి దేశం చైనా చేయవచ్చా? రష్యా, ఇరాన్‌ల నుంచి అత్యధికంగా చమురును కొంటున్నది చైనాయే. ఆ దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారు. చైనాను ఇలా వదిలేయవద్దు. భారత్‌ వంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’’ అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:05 AM