Share News

Pak PM Blames Ind: భారత్‌పై మళ్లీ నిందలు వేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

ABN , Publish Date - Nov 11 , 2025 | 09:44 PM

ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ కారణమని పాక్ ప్రధాని మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ ప్రోద్బలంతోనే మిలిటెంట్లు దాడికి దిగారని ఆరోపించారు.

Pak PM Blames Ind: భారత్‌పై మళ్లీ నిందలు వేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
Pak PM Shehbaz Sharif

ఇంటర్నెట్ డెస్క్: పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 12 మంది మరణించారు. నగరంలోని ఓ కోర్టు సమీపంలో ఈ దాడి జరిగింది. అయితే, ఘటన జరిగిన కొన్ని గంటలకే పాక్ ప్రధాని భారత్‌పై నిందలు వేయడం ప్రారంభించారు. భారత్‌ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. తన సహజధోరణిలో ఎలాంటి ఆధారాలు చూపకుండా ఈ ఆరోపణలు చేశారు (Pak Pm Blames India for Suicide Bombing Incident).

మీడియాతో మాట్లాడుతూ ఇలా మరోసారి పాక్ ప్రధాని తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. ‘భారత ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. పాక్‌ను అస్థిర పరచాలనేదే వారి లక్ష్యం’ అని రెచ్చిపోయారు. భారత్ మద్దతుతో కొందరు మిలిటెంట్లు ఇస్లామాబాద్‌ను టార్గెట్ చేసుకున్నారు. వీరి నెట్‌వర్క్ అఫ్గానిస్థాన్‌లో కూడా ఉంది. వానాలో చిన్నారులను బలితీసుకున్న దాడికి కూడా వీరే కారణమని అన్నారు (Pak Afghan Conflict).


దక్షిణాసియాలో ఉగ్రవాదానికి పాక్ పర్యాయపదంగా మారిన విషయం తెలిసిందే. అయితే, తను పాలు పోసి పెంచిన పాము తననే కాటేసిన ప్రతిసారీ నిందను భారత్‌పై నెట్టడం పాక్‌కు అలవాటుగా మారింది. ఇటీవల కాలంలో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్ర సంస్థ పాక్‌ పాలకులను వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ భారత్‌పై తన అక్కసు వెళ్లబోసుకుంటోంది. ఇక ఇస్లామాబాద్ పేలుడు ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని ఖవాజా ఆసిఫ్.. తమ దేశంలో యుద్ధ పరిస్థితి ఉందని అన్నారు. ఇది జాతికి మేలుకొలుపుగా భావించాలని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్ పాలకులే ఈ ఆత్మాహుతి దాడికి కారణమని అన్నారు. అఫ్గాన్, పాక్ ఘర్షణలు సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 09:54 PM