High Alert: 2026 న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 'హై అలర్ట్'
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:06 PM
ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు అంతా సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో ఇంటెలీజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.
2026 న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్దమవుతున్న వేళ షాకింగ్ విషయం వెల్లడవుతుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు ఉందని ఇంటలీజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు దేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. కొన్ని ప్రదేశాల్లో వేడుకలను క్యాన్సల్ చేసినట్లు సమాచారం. లాస్ ఏంజెల్స్ సమీపంలో మొజావే ఎడారిలో బాంబు దాడికి రిహాల్సల్ చేస్తున్న నలుగురు అనుమాతులను FBI అరెస్ట్ చేసింది. వీరు న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసి దాడికి ప్లాన్ చేయగా.. ముందుగానే దాన్ని అడ్డుకున్నామని ఫస్ట్ అసిస్టెంట్ US అటార్ని బిల్ ఎస్లీ తెలిపారు. వీరంతా లాస్ ఏంజెల్స్ ప్రాంత నివాసితులని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించ బోయే ఈవెంట్స్‌కి మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఉగ్రవాద ముప్పు (threat of terrorism)ఉందన్న కారణంగా పారిస్ (Paris) లో ప్రసిద్ద చాంప్స్ - ఎలిసీస్ (Champs-Élysées) వద్ద జరగాల్సిన బహిరంగ వేడుకలను అధికారులు రద్దు చేశారు. ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్ వేడుకలను వీక్షించేందుకు వర్చువల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక జర్మనీలో భద్రత ఖర్చులు పెరగడంతో కొన్ని నగరాల్లో క్రిస్మస్ మార్కెట్, ఈవెంట్స్ ని తగ్గించారు. ఇటీవల ఆస్ట్రేలియా(Australia)లో బాండీ బీచ్(Bondi Beach)లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఇక్కడ భద్రత గణనీయంగా పెంచారు. లండన్ లో జరగబోయే ‘లండన్ ఐ’ (London Eye) వద్ద జరిగే బాణా సంచా వేడుకల కోసం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు టికెల్ లేని వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తుర్కియే పర్యాటక ప్రాంతాల, మాల్స్, క్లబ్లుల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. భారత్ ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి
ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు
కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్