Peter Navarro: రష్యా చమురు.. నెత్తుటి సొమ్ము
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:24 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో సోమవారం మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు...
న్యూయార్క్, సెప్టెంబరు 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో సోమవారం మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురును ‘బ్లడ్ మనీ’ (నెత్తుటి సొమ్ము) అని వ్యాఖ్యానించారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ ‘‘వాస్తవం: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కొనుగోలు చేస్తోంది. ఇది నెత్తుటి సొమ్ము. ప్రజలు చనిపోతున్నారు’’ అని పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఇలాంటి విమర్శలే చేశారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News