NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:27 AM
NASA mission delay: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.

అమెరికా, మార్చి 13: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ ( Sunitha Williams), బచ్ విల్మోర్‌కు (Bach Vilmore) మళ్లీ నిరాశే మిగిలింది. నాసా మిషన్ (Nasa Mission) వాయిదా పడింది. దీంతో వీరి రాక మరింత ఆలస్యంగా కానుంది. వీరిద్దరు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్‌ను (NASA-SpaceX Crew 10 mission) రూపకల్పన చేసంది. ఈ క్రమంలో నలుగురు వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్‌లో బయలుదేరేందుకు సిద్ధం కాగా.. సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిసింది.
మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు నాసా -స్పేస్‌ఎక్స్ తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
Viral Video: ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. బీరు బాటిల్ మూతను ఎంత సింపుల్‌గా ఓపెన్ చేశాడో చూడండి..
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ స్టార్‌లైనర్‌లో సునీత ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా-స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇటీవల స్పేస్ నుంచి వ్యోమగాములు మీడియాతో మాట్లాడుతూ.. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక తమను తీసుకెళ్లేందుకు వస్తోందని.. ఆ నౌకలోనే తాము తిరిగి భూమి మీదకు రానున్నట్లు వ్యోమగాములు తెలిపారు. కానీ మిషన్‌లో సాంకేతిలోపం తలెత్తడంతో భూమి మీదకు వచ్చేందుకు ఎదురుచూస్తున్న సునీతకు మళ్లీ నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..
Posani Krishna Murali: న్యాయమూర్తి ఎదుట బోరున విలపించిన పోసాని.. వదిలేయాలంటూ వేడుకోలు..
Read Latest International News And Telugu News