Share News

Two Buildings Collapsed in Morocco: మొరాకోలో ఘోర ప్రమాదం.. రెండు భవనాలు కూలి 19 మంది మృతి

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:14 PM

మొరాకో దేశంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫెజ్ నగరంలో రెండు భవనాలు ఒకేసారి కూలిపోవడంతో 19 మంది మృతిచెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి.

Two Buildings Collapsed in Morocco: మొరాకోలో ఘోర ప్రమాదం.. రెండు భవనాలు కూలి 19 మంది మృతి
Two Buildings Collapsed in Morocco

ఇంటర్నెట్ డెస్క్: మొరాకో(Morocco) దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటైన పురాతన ఫెజ్‌(Fez) నగరంలో రెండు భవనాలు కూలిపోయిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు(Two Buildings Collapsed in Morocco). మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించాయి.


ఫెజ్ ప్రిఫెక్చర్‌(Fez prefecture)లోని స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన రెండు నాలుగంతస్తుల భవనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరాయని తెలిపారు. ప్రమాదానికి ముందు ఆ భవనాల్లో సుమారు 8 కుటుంబాలు నివాసం సాగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. భవనం కూలిపోవడంపై విచారణ చేపట్టిన అధికారులు.. నిర్మాణంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా లేక శిథిలావస్థకు చేరిన విషయమై అధికారులకు ముందే సమాచారం అందిందా, లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.


వెల్లువెత్తిన నిరసనలు..

ఇక.. ఫెజ్ నగరంలో సుమారు రెండు నెలల క్రితం జీవన పరిస్థితులు క్షీణించడంతో.. పేదరికం(Poverty) నిరుద్యోగం(Unemployment), ప్రజాసేవల వైఫల్యం(Inadequate Public Services)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. యువత చేపట్టిన ఈ నిరసనలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ వ్యాపించాయి. దీంతో ఈ నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. దీంతో అక్కడ చాలా మంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు.

ఇదిలా ఉండగా.. గత కొన్నేళ్లుగా ఆ దేశంలో భవనాలు కూలిపోయే ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.


ఇవీ చదవండి:

అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

థ్రిల్లింగ్ ఫైట్.. పాము ముంగిసల పోరాటంలో విజేత ఎవరో చూడండి..

Updated Date - Dec 10 , 2025 | 09:18 PM