Funny student video: అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:47 AM
ఫన్నీ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు విద్యార్థులు క్లాస్ బంక్ కొట్టి పారిపోదామని ప్రయత్నం చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు విద్యార్థులు క్లాస్ బంక్ కొట్టి పారిపోదామని ప్రయత్నం చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (boy bunk class video).
@corporatebanda అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి క్లాసు బంక్ కొట్టి కాలేజ్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించడం కనిపిస్తోంది. వారు గోడ దూకి అవతలి వైపు ఉన్న రేకుల షెడ్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆ అబ్బాయి తాడు ఉపయోగించి కిందకు దిగాడు. తర్వాత ఆ అమ్మాయి కిందకు దిగబోతూ ఏదో చూసి వెనక్కి పరిగెత్తింది. ఆ రేకుల షెడ్ కింద టీచర్ ఉన్నారు (viral student video).
అప్పటికే షెడ్ నుంచి కిందకు దిగిన అబ్బాయిని ఆ టీచర్ పట్టుకుని కొడుతుండడం కనిపిస్తోంది (bunking class gone wrong). దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.9 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..