Mongoose vs snake: థ్రిల్లింగ్ ఫైట్.. పాము ముంగిసల పోరాటంలో విజేత ఎవరో చూడండి..
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:44 AM
మనుషులే కాదు.. వన్య ప్రాణులు కూడా అనవసరంగా పాములు జోలికి వెళ్లవు. అయితే ముంగిస మాత్రమే పాముకు చుక్కలు చూపిస్తుంది. పాము, ముంగిస ఫైట్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. మనుషులే కాదు.. వన్య ప్రాణులు కూడా అనవసరంగా పాములు జోలికి వెళ్లవు. అయితే ముంగిస మాత్రమే పాముకు చుక్కలు చూపిస్తుంది. పాము, ముంగిస ఫైట్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (mongoose snake clash).
shubhhh__official అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రోడ్డు మీద నాగుపాము పడగ విప్పి చూస్తూ ఉంది. పక్కనున్న పొదల్లోంచి ఒక ముంగిస.. పాము వైపు దూసుకొచ్చింది. పడగ విప్పి ఉన్న పాముపై దాడి మొదలుపెట్టింది. ఆ ముంగిస నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్రంగా ప్రయత్నించింది. చాలా సేపు ఈ రెండింటి మధ్య భీకర యుద్దం జరిగింది. చివరకు ఈ యుద్దంలో ముంగిస పై చేయి సాధించింది (shocking animal fight).
పామును నోట కరుచుకొని పొదల్లోకి లాక్కెళ్లింది (wild animal fight video). అక్కడే ఉన్న కొందరు జనాలు పాము, ముంగిస ఫైట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాదాపు 50 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 6.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ముంగిస నుంచి తప్పించుకోవడం పాముకు తలకు మించిన భారమని ఒకరు కామెంట్ చేశారు. ఇది థ్రిల్లింగ్ ఫైట్ అంటూ మరికొందరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..