PM Modi: చైనాలో మోదీ కీలక భేటీలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:27 AM
జపాన్, చైనా దేశాల్లో పర్యటనకు ప్రధాని మోదీ గురువారం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన జాతీయ ప్రయోజనాలకు విశేషంగా..
31న జిన్‌పింగ్ 1న పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ, ఆగస్టు 28: జపాన్, చైనా దేశాల్లో పర్యటనకు ప్రధాని మోదీ గురువారం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన జాతీయ ప్రయోజనాలకు విశేషంగా ఉపకరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 31న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, సెప్టెంబరు 1న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వేర్వేరుగా భేటీ కానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇందుకోసం భారతీయ ఎగుమతులపై ఏకపక్షంగా సుంకాలను రెట్టింపు పెంచడంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..