Peter Navarro Modi Remarks: భారత్‌పై అక్కసు.. శ్వేతసౌధం సలహాదారు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:37 AM
శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్ళగక్కారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి కారణం భారత్ చేపడుతున్న రష్యా చమురు కొనుగోళ్లేనని అన్నారు. ఈ ఘర్షణలను మోదీ యుద్ధం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అమెరికా ప్రభుత్వ వర్గాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో తాజాగా షాకింగ్ కామెంట్స్ వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించారు. భారత్ చేపడుతున్న చమురు కొనుగోళ్లు రష్యా దూకుడుకు ఆజ్యం పోస్తున్నాయని అన్నారు. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తే తక్షణం సుంకాలను 25 శాతం తగ్గిస్తామని కూడా అన్నారు. ఓ అంతర్జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శాంతిస్థాపనకు మార్గం ఢీల్లీ మీదుగా ప్రయాణిస్తుందని పీటర్ నవారో కామెంట్ చేశారు. అమెరికా-భారత్ మధ్య చర్చలపై కూడా పీటర్ స్పందించారు. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే భారత్‌పై సుంకాలను 25 శాతం మేర తగ్గించగలమని అన్నారు. సుంకాల విషయంలో భారత్ తీరు గురించి నవారో మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో భారత్ బెట్టు చేస్తోంది. ఇది మాకు ఇబ్బంది పెట్టే అంశం. తాము అధిక అధిక సుంకాలు విధించట్లేదని భారత్ అంటోంది. సార్వభౌమ దేశంగా ఎవరి వద్ద నుంచైనా చమురు కొనే హక్కు ఉందని అంటోంది’ అని పీటర్ నవారో అన్నారు.
‘భారత్ చర్యల కారణంగా అమెరికాలోని వారందరూ నష్టపోతున్నారు. భారత్ నుంచి రష్యాకు అందే డబ్బు యుద్ధానికి ఇంధనంగా మారుతోంది. మరింత మంది ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు’ అని తెలిపారు. ఇక భారత్ విధించే సుంకాలు అమెరికాకు నష్టం చేస్తున్నాయని కూడా అన్నారు. ‘వ్యాపారులు, వినియోగదారులు అందరికీ నష్టమే. భారత్ విధించే అధిక సుంకాల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఫ్యాక్టరీలు కనుమరుగవుతున్నాయి. జీతాల్లో కోతలు ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు మోదీ యుద్ధంపై అమెరికన్ల ధనం వ్యయం చేయాల్సి వస్తోంది. మోదీ యుద్ధం అని ఎందుకంటున్నానంటే శాంతి స్థాపనకు మార్గంలో కొంత భాగం భారత్ మీదుగా వెళుతుంది’ అని కామెంట్ చేశారు.
అంతకుమునుపు కూడా పీటర్ నవారో భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఎగుమతులతో వచ్చే డబ్బుతో భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని అన్నారు. ఈ చమురును శుద్ధి చేసి విక్రయించే భారతీయ రిఫైనరీలు మరింత లాభపడుతున్నాయని తెలిపారు. చమురు కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాకు చెల్లించే డబ్బు ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆజ్యం పోస్తోందని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఉక్రెయిన్‌కు అమెరికా మిలిటరీ, ఆర్థికసాయం చేయాల్సి వస్తోందని, ఇదంతా అంతిమంగా అమెరికన్లపై ఆర్థిక భారం పెంచుతోందని చెప్పుకొచ్చారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకం బుధవారం నుంచీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ చేతిపై మళ్లీ ఎర్రని మచ్చ.. అసలేం జరుగుతోంది
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.. ప్రపంచదేశాలకు ట్రంప్ హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి