Canada: ఖలిస్థాన్ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ అరెస్టు
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:56 PM
ఏడాది కాలంలో గోసల్ అరెస్టు కావడం ఇది రెండోసారి. 2023లో నవంబర్‌లో గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు.
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) ఇంద్రజీత్ సింగ్ గోసల్ (Inderjit Singh Gosal)ను కెనడా అధికారులు అరెస్టు చేశారు. సిక్స్ ఫర్ జస్టిస్ (SFI)అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurupatwant Singh Pannun)కు ఇతను సన్నిహిత సహచరుడు. 2023లో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం కెనడాలో ఎస్ఎఫ్‌జే కార్యకలాపాలను 36 ఏళ్ల గోసల్ చూసుకుంటున్నాడు.
మారణాయుధాల ఆరోపణల కింద ఒట్టావాలో గోసల్‌ను కస్టడీలోకి తీసుకున్నట్టు అధికారులు ధ్రువీకరించారు. ఏడాది కాలంలో గోసల్ అరెస్టు కావడం ఇది రెండోసారి. 2023లో నవంబర్‌లో గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అనంతరం పీల్ రీజినల్ పోలీసులు అతన్ని షరతులతో విడుదల చేశారు. ఆ సమయంలో కెనడాలోని ఖలిస్థానీ రిఫరెండం కార్యకలాపాలకు కీలక వ్యూహకర్తగా గోసల్‌ను చెప్పుకునేవారు.
ఎస్ఎఫ్‌జే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన పన్నూన్‌కు విశ్వసనీయ సహచరుడుగా పేరున్న గోసల్ ఆయనకు బాడీగార్డ్‌గానూ వ్యవహరించేవాడు. గ్రూప్ ఓవర్సీస్ ఆపరేషన్లలో కీలక పాత్రధారిగా వ్యవహరించేవాడు.
ఇవి కూడా చదవండి..
పాక్ దళాల వైమానిక దాడులు.. సొంత ప్రజలే బలి
చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి