Iran Vs Israel: కొనసాగుతోన్న యుద్ధం.. తొలిసారి క్లస్టర్ బాంబులు ప్రయోగించిన ఇరాన్
ABN , Publish Date - Jun 20 , 2025 | 09:35 AM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దం కొనసాగుతోంది. శుక్రవారం ఈ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో భాగంగా ఇరుదేశాలు.. ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులు చేసుకొంటున్నాయి.
టెల్ అవీవ్, జూన్ 20: ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం ఈ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ ఇరుదేశాలు క్షిపణులు, డ్రోనులతో ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. ఇరాన్‌లోని అణు మౌలిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. అందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులు తొలిసారిగా ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరో వైపు ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రిపై ఇరాన్ గురువారం క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ స్పందించారు. అందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్‌కు అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల గడువు విధించారు. అనంతరం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చేది లేనిది వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ సారథ్యంలో అణ్వాయుధాలను మరో రెండు వారాల్లో ఇరాన్ తీసుకు వస్తుందని.. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే పలుమార్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాకికి ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ వీట్కఫ్ ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు.
ఈ యుద్ధం జరుగుతున్న వేళ.. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య ప్రమాదకరమని రష్యా హెచ్చరించింది. దేశ ప్రజలు దృఢంగా ఉండాలని ఇరాన్‌లోని సుప్రీం లీడర్ ఖమేనీ పిలుపునిచ్చారు. శత్రువుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అదీకాక.. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య చర్చలకు తాను ప్రయత్నిస్తానని రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్
రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే
For International News And Telugu News