Indo Russian Defense Collaboration: గడువులోపే భారత అమ్ముల పొదిలోకి ఏకే 203 తుపాకులు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:03 AM
భారత్ రష్యా భాగస్వామ్యంతో.. మేకిన్ ఇండియాలో భాగంగా షేర్ పేరుతో కలాష్నికోవ్ సిరీ్‌సలో..
లఖ్‌నవూ, జూలై 18: భారత్-రష్యా భాగస్వామ్యంతో.. మేకిన్ ఇండియాలో భాగంగా ‘షేర్’ పేరుతో కలాష్నికోవ్ సిరీ్‌సలో.. ఏకే-203 తుపాకుల తయారీ వేగం పుంజుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో ఉన్న ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఐఆర్‌ఆర్‌పీఎల్) యూనిట్ ఈ తుపాకుల తయారీలో వేగాన్ని పెంచింది. ఏటా 1.5 లక్షల ఉత్పాదక సామర్థ్యంతో.. రూ.5,200 కోట్ల కాంట్రాక్టులో భాగంగా.. భారత సైన్యానికి 2032 అక్టోబరు నాటికి 6,01,427 ఏకే-203 తుపాకులు అందేలా ఐఆర్‌ఆర్‌పీఎల్‌తో ఒప్పందం ఉంది. అయితే.. ఇప్పటికే 48 వేల రైఫిళ్లను భారత సైన్యానికి అప్పగించామని ఐఆర్‌ఆర్‌పీఎల్ సీఈవో-ఎండీ మేజర్ జనరల్ ఎస్‌కే శర్మ వెల్లడించారు. 6 లక్షల తుపాకులను అందజేయాలనే ఒప్పందాన్ని నిర్ణీత గడువు కంటే.. 22 నెలల ముందే.. అంటే 2030 డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని ఆయన వివరించారు. ఏకే-203 తుపాకులు నిమిషానికి 700 తూటాలను పేల్చగలవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకే-47, ఏకే-57తో పోలిస్తే.. షేర్ తుపాకులు అత్యాధునికమైనవి. భారత సైన్యం మూడు దశాబ్దాలుగా ఇన్సాస్ రైఫిళ్లను వాడుతుండగా.. వాటి స్థానంలో ఏకే-203 తుపాకులను ప్రవేశపెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి