Peter Navarro: భారత్ రష్యాతో కాదు అమెరికాతో ఉండాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:03 AM
రష్యాతో భారత్ దోస్తీపై తరచూ తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి అక్కసు వెళ్లగక్కారు...
పుతిన్, జిన్‌పింగ్‌లతో సఖ్యత పెంచుకోవడం సిగ్గుచేటు: నవారో
వాషింగ్టన్, సెప్టెంబర్ 2: రష్యాతో భారత్ దోస్తీపై తరచూ తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ప్రధాని మోదీ అవకాశవాదంతో పుతిన్, జిన్‌పింగ్‌లతో సఖ్యత పెంచుకుంటున్నారని, ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. భారత్ ఉండాల్సింది రష్యాతో కాదని, అమెరికాతో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మోదీ త్వరలోనే గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో)లో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న అజర్‌బైజాన్‌కు భారత్ చెక్ పెట్టింది. దీనిపై అజర్‌బైజాన్ విమర్శలు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచినందుకు భారత్ పగతీర్చుకుంటోందని ఆరోపించింది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం జరగనున్న చైనా ఆర్మీ గ్రాండ్ పరేడ్‌లో మునీర్ పాల్గొననున్నారు.
పాకిస్థాన్‌తో బిజినెస్ కోసమే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ వ్యాపారాల కోసం భారత్‌తో సంబంధాలను పణంగా పెట్టారని ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఆరోపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ట్రంప్ కుటుంబంతో కలసి వ్యాపారాలు చేసేందుకు పాకిస్థాన్ ముందుకు రావడంతో.. భారత్‌తో సంబంధాలను ట్రంప్ పణంగా పెట్టారు. ఇది అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం’’ అని పేర్కొన్నారు. చైనాకు చెక్ పెట్టాలంటే అమెరికా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News