Khawaja Asif: మా యుద్ధ విమానాలకు ఏమీ కాలేదు.. భారత వాయుసేన చీఫ్ ప్రకటనపై పాక్
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:28 PM
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా 6 పాక్ యుద్ధ విమానాలను కూల్చామంటూ భారత వాయుసేన చీఫ్ చేసిన ప్రకటనను పాక్ రక్షణ శాఖ మంత్రి తోసిపుచ్చారు. తమకు చెందిన ఒక్క విమానానికీ కూడా నష్టం జరగలేదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత దాడుల్లో ఆరు పాక్ ఫైటర్ జెట్స్ ధ్వంసం అయ్యాయంటూ భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రకటనపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందించారు.
భారత్ వాయుసేన చీఫ్ ప్రకటనను మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తోసిపుచ్చారు. తమ విమానాలకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. తమ విమానాల్లో ఒక్కదానికి కూడా నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. పాక్ విమానాల కూల్చివేతపై భారత్ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించిందని ప్రశ్నించారు. తాము మాత్రం తొలి నుంచి భారత యుద్ధ విమానాలను కూల్చి వేసిన విషయాన్ని చెబుతూనే ఉన్నామని అన్నారు. ఇరు దేశాలు తమ వద్ద ఎన్ని విమానాలు ఉన్నాయనే విషయాన్ని స్వతంత్ర సంస్థలను తనిఖీ చేయిస్తే భారత్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. పాక్ సార్వభౌమత్వానికి, సమగ్రతను ఉల్లంఘించే చర్యలకు అంతే దీటుగా వేగంగా స్పందిస్తామని హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ భారత దళాలు పాక్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను ఒక నిఘా విమానాన్ని కూల్చేశాయని అన్నారు. సర్ఫే టూ ఎయిర్ దాడుల్లో ఇదే అత్యంత భారీదని పేర్కొన్నారు. పాక్ వాయుసేన ఆయుద్ధ సంపత్తికి భారీ నష్టం జరిగిందని అన్నారు. జకోబాబాద్‌లోని హ్యాంగర్‌లో ఉన్న ఎఫ్-16 విమానం పాక్షికంగా ధ్వంసమైందని అన్నారు. మురీద్, చక్లాలాలోని రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లు గగనతల దాడుల్లో ధ్వంసమయ్యాయని అన్నారు. రష్యా రూపొందించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ దాడులను సమర్థంగా తిప్పి కొట్టిందని అన్నారు. ఫలితంగా పాక్ దిగొచ్చి కాల్పుల విరమణను ప్రతిపాదించిందని అన్నారు. ఆపరేషన్
సిందూర్‌కు ముందు, ఆ తరువాత ఉగ్రస్థావరాలను పరిస్థితిని తెలియజేసే ఉగ్రహ చిత్రాలను కూడా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ప్రదర్శించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్ మే 10 ముగిసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో..
అప్పటివరకూ భారత్‌తో చర్చలు ఉండవు.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి