Missing Elderly: అమెరికాలో అదృశ్యమైన వృద్ధుల మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:16 AM
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది.
వాషింగ్టన్, ఆగస్టు 3: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది. అమెరికాలో బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి ఇటీవల కారులో బయలుదేరిన వీరు కనిపించకుండా పోయారు. వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మార్షల్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఈ వృద్ధులు ప్రయాణించిన కారు ఓ ఎత్తైన రోడ్డులో అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. మృతి చెందిన వారిని ఆశ దివాన్(85), కిషోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీత దివాన్(84)గా గుర్తించారు. జూలై 31 నుంచి వీరి నుంచి ఎటువంటి సమాచారం లేకుండాపోయిందని మార్షల్ కౌంటీ షెరిఫ్ డార్తీ తెలిపారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి