Share News

Trump Birthright Citizenship Ruling: జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమే..

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:17 AM

జన్మతః వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వు..

Trump Birthright Citizenship Ruling: జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమే..

అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు

వాషింగ్టన్‌, జూలై 24: జన్మతః వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వు.. రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా దాని అమలును నిలిపేస్తూ గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన యూఎస్‌ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు త్రిసభ్య ప్యానెల్‌ బుధవారం తీర్పు వెలువరించింది. ‘అమెరికాలో పుట్టిన చాలా మంది పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ తెచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని జిల్లా కోర్టు సరిగ్గానే నిర్ధారించింది. మేం కూడా పూర్తిగా అంగీకరిస్తున్నాం’ అని పేర్కొంది. అంతకుముందు న్యూహ్యాం్‌పషైర్‌ ఫెడరల్‌ కోర్టు ఇదే రకమైన తీర్పునివ్వగా.. దేశాన్ని ప్రభావితం చేసే ఉత్తర్వులను దిగువ కోర్టులు ఇవ్వలేవంటూ సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు విధించింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు పేర్కొన్న మినహాయింపుల్లో ఒకదానికి కిందకు వస్తుందంటూ తేల్చిన యూఎస్‌ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు తాజా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై ట్రంప్‌ పరిపాలన విభాగం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:17 AM