Share News

Donald Trump: ట్రంప్‌లో తడబాటు.. అదే మతిమరుపు.. అచ్చు బైడెన్ లాగే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 08:15 AM

జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడబాటుకు గురైన వీడియోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. ట్రంప్ కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ తరహాలో తడబాటుకు గురవుతున్నారంటూ అనేక మంది కామెంట్ చేస్తున్నారు.

Donald Trump: ట్రంప్‌లో తడబాటు.. అదే మతిమరుపు.. అచ్చు బైడెన్ లాగే..
Donald Trump Tokyo Guard Of Honour

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం దూకుడుగా కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జపాన్ పర్యటనలో తడబాటుకు లోనుకావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాను ఎక్కడ ఉన్నదీ, ఏం చేస్తున్నదీ గుర్తించలేని స్థితిలో ట్రంప్ ఉన్నట్టు అనిపిస్తోందని జనాలు కామెంట్ చేశారు (Donald Trump Gaffe).

జపాన్ పర్యటనకు వచ్చిన ట్రంప్‌కు ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ట్రంప్ వెంట జపాన్ ప్రధాని సనాయె తకాయిచి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సైనికాధికారుల వందనాన్ని స్వీకరించాల్సిన ట్రంప్ ఇదేమీ పట్టనట్టు ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే నిలబడిపోయారు. మరోవైపు తిరగాలంటూ జపాన్ ప్రధాని సైగ చేశాక మళ్లీ ట్రంప్ ముందుకు కదిలారు. ఆ తరువాత ఆయన ఎటు వెళ్లాలో మరో సైనికాధికారి చెప్పేందుకు ప్రయత్నించినా ట్రంప్ వెంటనే అర్థం చేసుకోలేకపోయారు. క్షణకాలం పాటు తడబడ్డారు. ఇక ఈ వీడియోలు వైరల్ కావడంతో జనాలు షాకయిపోతున్నారు. ట్రంప్ వైఖరి బైడెన్‌ను గుర్తుకుతెస్తోందని వ్యాఖ్యానించారు (Trump Tokyo visit).


ఇటీవల కాలంలో ట్రంప్ తడబాటు ఉదంతాలు చర్చనీయాంశంగా మారాయి. వివిధ దేశాలు, దేశాధినేతల పేర్లు పలికే విషయంలో ట్రంప్ పొరపాట్లు చేశారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానంటూ నిత్యం చెప్పుకునే ట్రంప్ ఈ మధ్య ఓసారి పొరపాటున ఇండియాకు బదులు ఇరాన్ పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆరోగ్య స్థితిగతులపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ట్రంప్‌కు మతిమరుపు మొదలైందనేందుకు ఇవి తొలి సంకేతాలు అయ్యే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్టు డా. జాన్ గార్ట్నర్ తన పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. శ్వేత సౌధం మాత్రం ఈ అనుమానాలను తోసిపుచ్చింది. ట్రంప్‌కు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో కూడా బరిలోకి దిగుతానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

మూడో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ మక్కువ

పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 29 , 2025 | 08:40 AM