Share News

Bathroom Breaks: తరచూ బాత్‍రూమ్‌కు ఉద్యోగి.. షాకిచ్చిన కంపెనీ

ABN , Publish Date - Dec 15 , 2025 | 05:02 PM

అతిగా బాత్‍రూమ్‌కు వెళ్లిన ఉద్యోగికి.. అతడు పని చేసే సంస్థ ఊహించని షాకించింది. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈఘటన చైనాలో చోటు చేసుకుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే..

Bathroom Breaks: తరచూ బాత్‍రూమ్‌కు  ఉద్యోగి.. షాకిచ్చిన కంపెనీ
China employee

చైనా, డిసెంబర్ 15: తరచూ బాత్‌రూమ్‌కు వెళ్తున్న ఉద్యోగిని ఓ సంస్థ తొలగించింది. అతడు కోర్టును ఆశ్రయించి రూ.41 లక్షలు డిమాండ్ చేశాడు. కోర్టు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన చైనా (China)లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కథనాన్ని హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేసే ఓ వార్తాసంస్థ ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం...


తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సుకు చెందిన లీ అనే వ్యక్తి 2010లో ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అలెర్ట్ గా ఉంటూ, కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన మెసేజ్‌లకు తక్షణం స్పందించడం అతడి డ్యూటీ. అయితే అతడు ఎక్కువ సమయం వర్క్ లో కాకుండా వేరే ప్రదేశంలో ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గమనించారు. చాట్‌ యాప్‌ ద్వారా అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. గతేడాది ఏప్రిల్‌-మే మధ్యకాలంలో 14సార్లు బాత్‌రూమ్‌ బ్రేక్‌ తీసుకున్నట్లు సదరు సంస్థ ఉన్నతాధికారులు గుర్తించారు.


వాష్ రూమ్ కి వెళ్లిన.. ప్రతిసారి దాదాపు అరగంట విశ్రాంతి తీసుకున్నట్లు గుర్తించారు. ఓసారి ఏకంగా నాలుగు గంటలపాటు బ్రేక్‌ తీసుకున్నట్లు సదరు సంస్థ యాజమాన్యం నిర్ధారణకు వచ్చింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కారణంతో అతడిని జాబ్ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని సంబంధిత కార్మిక సంఘానికి కూడాఆ కంపెనీ తెలియజేసింది. మరోవైపు ఉద్యోగం నుంచి తనను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ లీ స్థానిక కోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యం కారణంగానే అలా వెళ్లాల్సి వచ్చిందని న్యాయస్థానానికి తెలియజేశాడు. అక్రమంగా తొలగించినందుకు 3,20,000 యువాన్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.41లక్షలు) పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు.


ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. అతడి మాటల్లో నిజం లేదని అభిప్రాయపడింది. అయితే, సంస్థకు అందించిన సేవలు, నిరుద్యోగం తర్వాత అతడి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని 30,000 యువాన్‌లను (సుమారు రూ.4లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. ఇలా బాత్‌రూమ్‌ బ్రేక్‌ల కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనలు చైనాలో గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2023లో ఓ ఉద్యోగి ఆరు గంటల విరామం తీసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!

ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: కెప్టెన్ మార్క్‌రమ్

Updated Date - Dec 15 , 2025 | 05:02 PM