Share News

School Bus Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది విద్యార్థులు మృతి

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:31 PM

అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, సంతోషంగా గడిపిన విద్యార్థులకు మృత్యు కుహరంలోకి అడుగుపెడతామన్న విషయం తెలియదు. గ్రాడ్యుయేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది.

School Bus Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది విద్యార్థులు మృతి
School Bus Falls into Ravine

కొలంబియాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆంటియోక్వియా ప్రాంతంలో రెమోడియోస్ మున్సిపాలిటీ సమీపంలో స్కూల్ బస్సు లోయలో పడిపోయింది. 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు గ్రాడ్యుయేషన్ వేడుకలు పూర్తి చేసుకొని మెడెలిన్ కు తిరిగి వస్తున్న సమయంలో బస్సు 40 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.


ఆంటియోక్వెనో హై స్కూల్ యాజమాన్యం ఈ విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తోటి విద్యార్థులు వారికి నివాళులర్పించారు. కొలంబియా అధ్యక్షులు గుస్తావో పెట్రో బాధిత కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎంతో దురదృష్ట సంఘటన అని.. బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా కన్నుమూయడం ఎంతో బాధాకరంగా ఉందని అన్నారు.

colambia.jpg


భవిష్యత్ లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ట్రాఫిక్ చట్టాలను పాటించేలా చూస్తామని కొలంబియా జాతీయ రోడ్డు భద్రత సంస్థ చెప్పింది.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!

ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: కెప్టెన్ మార్క్‌రమ్

Updated Date - Dec 15 , 2025 | 03:43 PM