Share News

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

ABN , Publish Date - Mar 16 , 2025 | 02:46 PM

క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు.

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని నోష్కిలో సైనికులు ప్రయాణిస్తున్న మిలటరీ కాన్వాయ్‌పై ఆదివారంనాడు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. క్వెట్వా నుంచి తఫ్తాన్ వెళ్తుండగా ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించుకుంది. 90 మంది సైనికులను చంపినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది.

US Strikes: నరకం చూపిస్తా.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్


కాగా, క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు. ఒక బస్సును ఐఈడీ ఉంచిన వాహనం ఢీకొందని, అది ఆత్మాహుతి దాడి కావచ్చని, మరో బస్సును వార్‌హెడ్‌తో కూడిన రాకెట్‌తో ఢీకొట్టారని తెలిపారు. ఘటనా స్థలికి ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు చేరుకోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. 440 మంది ప్రయాణికులతో వెళ్తున రైలును బీఎల్ఏ ఉగ్రవాదులు హైజాగ్ చేసిన కొద్దిరోజుల్లోనే మరోసారి బీఎల్‌ఏ ఉగ్రపంజా విసరడం సంచలనమైంది.


90 మందిని చంపేశాం..

కాగా, ఆదివారంనాడు ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 90 మంది సైనికుల హతమైనట్టు బీఎల్ఏ ప్రకటించింది. మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తామని తెలిపింది. పాకిస్థాన్‌లో ఇంధన, ఖనిజ సంపదపరంగా అతిపెద్దదిగా, జనాభాపరంగా అతిచిన్న ప్రావిన్స్‌గా బెలూచిస్థాన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని బలోచ్ వాసులు ఆరోపిస్తుండగా, ఇస్లామాబాద్ మాత్రం ఆ వాదనను కొట్టివేస్తోంది. పాకిస్థాన్ నుంచి తమకు ఇండిపెండెన్స్ కావాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది.


Pakistan Train Hijack: 214 మంది బందీలను చంపేశాం.. బలూచ్ మిలిటెంట్లు సంచలన ప్రకటన

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..

NASA Crew 10 Mission: నాసా క్రూ-10 మిషన్ ప్రారంభం.. త్వరలో భూమ్మీదకు చేరనున్న సునీతా విలియమ్స్

Read Latest and International News

Updated Date - Mar 16 , 2025 | 03:44 PM