Mexico: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:48 AM
మెక్సికోలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.
మెక్సికో, జూన్ 26: మెక్సికో గ్వానాజువాటో రాష్ట్రంలో ఇరాపుయాటో నగరంలో జరిగిన వేడుకల్లో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. బాప్టిస్ట్ సెయింట్ జాన్ జన్మదినం సందర్భంగా బుధవారం అర్థరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఆ క్రమంలో ప్రజలంతా భయాందోళనతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్నారు. మరోవైపు.. ఇదే గ్వానాజువాటో రాష్ట్రంలో శాన్ బార్టోలో డి బెర్రియోస్‌లోని క్యాథలిక్ చర్చిలో గత నెలలో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
గ్వానాజువాటో రాష్ట్రం.. మెక్సికోకు వాయువ్య ప్రాంతంలో ఉంది. దేశంలోని అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల్లో ఇది ఒకటి. ఈ రాష్ట్రంలో పలు గ్రూప్‌లు అధిపత్యం కోసం నిరంతరం ఘర్షణలకు దిగుతాయి. ఆ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1435 మంది మరణించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇది రెట్టింపు అని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడి.. ప్రశంసిస్తూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
For More International News and Telugu News