Share News

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:34 PM

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి మిలటరీ ఆపరేషన్ చేపట్టారు. దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడికే తమదే బాధ్యతని టీటీపీ ప్రకటించిన కథనాలు వెలువడుతున్నాయి.

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా
Military operation in Khyber Pakhtunkhwa

ఇస్లామాబాద్: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) మిలిటెంట్లు మరోసారి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతమైన ఒరాక్జాయ్ జిల్లాలో రెచ్చిపోయారు. సాయుధ బలగాలు ప్రయాణించే వాహనమే లక్ష్యంగా మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్, మరో మేజర్ సహా 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 19 ఉగ్రవాదులను సైతం సైన్యం మట్టుబెట్టింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఈ ఒరాక్జాయ్ జిల్లా ఉంది.


ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి మిలటరీ ఆపరేషన్ చేపట్టారు. దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడికే తమదే బాధ్యతని టీటీపీ ప్రకటించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.


ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని కరక్‌లో గత నెలలో పాక్ బలగాలు మిలిటెంట్ల శిబిరంపై విరుచుకుపడ్డాయి. 17 మంది టీటీపీ టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. కాల్పుల్లో ముగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీపీ గ్రూప్ పాక్ దళాలపై దాడులు ముమ్మరం చేసింది. ఆ గ్రూప్ నేతలు, ఫైటర్లు చాలామంది ఆప్ఘనిస్థాన్‌లో శరణార్ధులుగా ఉంటున్నారు. గత నెలలో తీరాహ్ ప్రాంతంలోని ఒక గ్రామంపై పాక్ మిలటరీ ఆపరేషన్ చేపట్టింది. టీటీపీ మిలిటెంట్ల రహస్య స్థావరాలుగా అనుమానిస్తూ జరిపిన ఈ దాడుల్లో 30 మంది పౌరులు మృతి చెందారు. దీంతో పాక్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.


ఇవి కూడా చదవండి..

ట్రంప్‌నకు షాక్.. తాలిబన్, పాకిస్థాన్, చైనా, రష్యాకు భారత్ మద్దతు..

పాక్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 04:02 PM